|
|
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 09:18 PM
రామగిరి మండలం రాజాపూర్ ప్రజలకు అండగా ఉంటానని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. సింగరేణి సంస్థ ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 గనితో రాజాపూర్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామ కాంగ్రెస్ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి రాజాపూర్ ప్రజలు పడుతున్న కష్టాలు దృష్టికి వచ్చాయని, న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేపు రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం ఉదయం మంథని నియోజకవర్గం పర్యటీంచనున్నారు. తన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు 26 వర్ధంతి సందర్భంగా మంథని, కాటారంలోని శ్రీపాద రావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించనున్నారు. కాటారం నూతన జీపీ బిల్లింగ్ వద్ డీఎంఏఫ్టీ నిధుతో 50 లక్షలతో నిర్మించిన కాటారం నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.