|
|
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 09:15 PM
రాజపేట మండలం బొందుగుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు పాల్గొన్నారు.ఈ సంధర్భంగా ముందుగా అమ్మవారి అలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో గాంధీజీ గారి,అంబెడ్కర్ గారి,రాజ్యాంగాన్నీ చేతిలో పట్టుకొని గ్రామంలో ఉన్న వార్డుల్లో ర్యాలీగా తిరుగుతూ వారి విలువులను ప్రజలకు తెలియజేసారు.ఈ సందర్భంలో సీసీ రోడ్డును ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.