|
|
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 09:11 PM
HCU భూముల అక్రమాల్లో రూ.10 వేల కోట్ల అవినీతి ముమ్మాటికీ నిజమేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. ప్రభుత్వానికి చేతనైతే HYD భూములను ఏం చేసిందో వివరంగా ప్రజలకు తెలియజెప్పాలన్నారు. కరీంనగర్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా 13 నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, సీనియర్ నేతలు, పార్టీ నాయకులతో సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను చేసిన ఆరోపణలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం, పార్టీ ఒక్కొ మాట మాట్లాడుతోందన్నారు.