|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 04:27 PM
నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై స్పందించారు. హర్యానాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమై ఉందని విమర్శించారు. ప్రకృతి విధ్వంసం, వన్యప్రాణులకు హాని కలిగించడం కాంగ్రెస్ పాలనలో సాధారణ విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని దుయ్యబట్టారు.