|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 08:15 PM
గత BRS ప్రభుత్వం తీసుకువచ్చిన 'ధరణి' పోర్టల్ రైతులకు ప్రయోజనకరంగా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శిల్పకళా వేదికగా 'భూభారతి' ప్రారంభోత్సవంతో మాట్లాడారు. 'దొరలు, భూస్వాములకు అనుకూలంగా ధరణి పోర్టల్ చేశారు. గత ప్రభుత్వం రైతులకు కంటిమీద నిద్ర లేకుండా చేసే చట్టం చేసింది. ఖమ్మం, కామారెడ్డి, ములుగు, MBNRలోని ఒక్కో మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఏప్రిల్ 17 నుంచి భూభారతి అమలు చేయబోతున్నాం' అని ప్రకటించారు.వీఆర్వో, వీఆర్ ఏలు చెప్పినట్టు వినలేదని కేసీఆర్ అందరినీ తొలగించారు. భూభారతి చట్టంతో అధికారులు అహర్నిశలు కష్టపడ్డారు. కలెక్టర్ల దగ్గరున్న కొన్ని పవర్స్ ను కింది అధికారులకు ఇచ్చాం. పలు రాష్ట్రాల్లో ఉన్న భూచట్టాలను అధ్యయనం చేసి..చట్టాన్ని రూపొందించాం. హరీశ్ రావులాంటి వాళ్లు ఇచ్చిన సలహాలు,సూచనలను కూడా భూభారతిలో చేర్చాం. 2020 చట్టం చేయకుముందు రైతులు సంతోషంగా ఉన్నారు.