|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 08:13 PM
ఇల్లందు టౌన్ బుగ్గ వాగు దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ వాహన తనిఖీల్లో 19. 9 తులాల బంగారం, 20 తులాల వెండితో ఉన్న కోరి రాహుల్(23)ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ చంద్రభాను సోమవారం తెలిపారు. రెండు రోజుల క్రితం కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో బంగారం చోరీకి గురైంది. వారి ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టగా పట్టుబడినట్లు వెల్లడించారు. ఆ చోరిని నిందితులు నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు.