|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 12:28 PM
బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు ఆధ్వర్యంలో రాయగిరి నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పాదాల వరకు భారీ ఎత్తున పాదయాత్ర. ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు విజయవంతం కావాలని, కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రిగా కావాలని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు కోరుతూ తుంగ బాలు పాదయాత్ర నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ఒగ్గు శివ, దేవరుప్పల ప్రవీణ్ రెడ్డి మరియు బీఆర్ఎస్, బీఆర్ఎస్వి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.