|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 12:34 PM
బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పరిపాలన విభాగం భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేడ్కర్ కు నివాళులర్పించిన వారిలో పరిపాలన విభాగం అదనపు డీసీపీ రవి, ఏఆర్ అదనపు డిసిపి సురేష్ కుమార్ తో పాటు ఏసీపీలు ఇన్స్ స్పెక్టర్లు, ఆర్. ఐలతో పాటు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది అంబేడ్కర్ కు ఘనంగా నివాళులర్పించారు