|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 01:49 PM
TG: బావిలో దూకి ఇద్దరు తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. చిలుకూరు మండలం కొత్త కొండాపురం గ్రామానికి చెందిన వీరమ్మ, తన కుమారుడు నాగేశ్వరరావుతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు చేసుకుంది. అయితే రెండ్రోజుల క్రితం వీరమ్మ అన్న నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో తమ బాగోగులు చూసేవారు లేరని మనస్తాపం చెంది, ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.