|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 08:56 PM
తన యూజర్లను పెంచుకునేందుకు ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని తన కస్టమర్లకు 10 నిమిషాల్లో సిమ్ కార్డులను డెలివరీ చేసేందుకు బ్లింకిట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశంలోని 16 నగరాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండగా తాజాగా హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. రూ. 49 కన్వీనియన్స్ ఫీజుతో 10 నిమిషాల్లో సిమ్ కార్డులను ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నట్లు తెలిపింది.యాక్టివేషన్ల కోసం, ఎయిర్ టెల్ కస్టమర్లు తమకు ఏ సహాయం కావాలన్నా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా హెల్ప్ సెంటర్ ను యాక్సెస్ చేయవచ్చు. కొత్త కస్టమర్లు సహాయం అవసరమైతే 9810012345 కాల్ చేయడం ద్వారా సపోర్ట్ ను పొందవచ్చు. సిమ్ కార్డ్ డెలివరీ అయిన తరువాత, సజావుగా, ఇబ్బంది లేని సేవల కోసం కస్టమర్ లు 15 రోజుల సమయంలో సిమ్ ను యాక్టివేట్ చేయడం తప్పనిసరి అని ఎయిర్ టెల్ తెలిపింది.