|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 10:45 AM
నగరంలో అక్రమ మోటార్ వాడకాన్ని అరికట్టడానికి.. నీటి వృథాను నివారించడానికి జలమండలి మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్‌ను ప్రారంభం అయింది. ప్రధానంగా లో ప్రెజర్ ఉన్న ప్రాంతాలు.. మోటార్ల వాడకం ఎక్కువగా ఉన్న కాలనీలలో ఈ డ్రైవ్‌లో బాగంగా ఎండీ నుంచి క్షేత్ర స్థాయిలో సిబ్బందితో కలిసి పాల్గొని కొన్ని ప్రాంతాల్లో మోటార్లు సీజ్ చేశారు.ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజిలెన్స్, స్థానిక అధికారులతో కలిసి మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో నీటి సరఫరా సమయంలో పర్యటించి తనిఖీలు నిర్వహించారు. కొంతమంది అపార్ట్మెంట్ వాసులతో ముచ్చటించిన ఎండీ దాదాపు 150 కిలో మీటర్ల నుంచి పెద్ద పంపులు, భారీ పైపుల ద్వారా నగర పౌరులకు జలమండలి నీటి సరఫరా చేస్తోందని.. వెయ్యి లీటర్లకు శుద్ధి చెయ్యడానికి రూ. 50 వరకు ఖర్చు చేసి తాగునీరు సరఫరా చేస్తున్నామని, అలాంటి నీటిని మొక్కలకు, ఫ్లోర్, వాహనాలను కడగడానికి వినియోగించకూడదని అన్నారు. ఈ సందర్బంగా ఎండీ మాట్లాడుతూ... జలమండలి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తోందని, కాబట్టి.. నీటిని వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని అన్నారు. రానున్నరోజులలో నీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తాగునీటికై సరఫరా చేసే శుద్ధమైన నీటిని గార్డెనింగ్, నిర్మాణం తదితర అవసారకు వృధా చేయకూడని విజ్ఞప్తి చేసారు.
అలాగే నల్లలకు మోటార్లు బిగించి నీటిని తోడితే మిగితా వినియోగదారులకు లో ప్రెషర్ తో నీటి సరఫరా కావడంతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అలాగే నీటి సరఫరా అవరాలకు సరిపోక ట్యాంకర్ బుక్ చేస్తున్నారని.. దీంతో ట్యాంకర్ డిమాండ్ పెరుగుతున్నట్లు చెప్పారు. అందుకే ఈ డ్రైవ్ చేపట్టినట్టు ఈ సందర్బంగా వెల్లడించారు. ఈ డ్రైవ్ జలమండలి పరిధిలోని అన్ని డివిజన్ ప్రాంతాల్లో నిర్వహిస్తామని.. ఈడీ డైరెక్టర్ నుంచి కిందిస్థాయి లైన్ మెన్ వరకు పాల్గొని అక్రమ మోటార్లు ను సీజ్ చేసి నీటి వృధా అరికట్టాలని సూచించారు. అంతకు ముందు ప్రాంతంలోని అపార్ట్మెంట్ వాసులు జలమండలి పైపులైనుకు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న వినియోగదారులను గుర్తించి జలమండలి విజిలెన్స్ సిబ్బంది మోటార్లు సీజ్ చేసారు. మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ లో మొదటి రోజు ఇప్పటివరకు అన్ని డివిజన్ లలో కలిపి మొత్తం 64 మోటార్లను సీజ్ చేయగా 84 మంది వినియోగదారులకు అక్రమంగా మోటార్లు ఉపయోగించినందుకు.. నీటి వృధా చేసినందుకు పెనాల్టీ విధించారు. అత్యధికంగా ఓ అండ్ ఎమ్ డివిజన్ లో 6 ఎస్ఆర్ నగర్ పరిధిలో 25 మోటార్లు సీజ్ చేసి పెనాల్టీ వేశారు.