|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 03:09 PM
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. గత కొన్నాళ్లుగా భారీగా పెరుగుతున్న పోతున్న బంగారం ధరకు రెండు మూడు రోజులుగా దిగి వస్తోంది.నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం. ఒకప్పుడు పసిడి ధరలు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేవి. కానీ గత కొన్నాళ్లుగా బంగారం ధర రాకెట్ కంటే వేగంతో దూసుకుపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం బంగారం ధరలు చుక్కలను తాకుతుంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 95వేల రూపాయలకు పై పలుకుతోంది. త్వరలోనే బంగారం ధర తులం లక్ష రూపాయలు కానుందని నిపుణులు అంటున్నారు. ఇది ఇలా ఉండగా రెండు మూడు రోజుల నుంచి బంగారం ధర దిగివస్తోంది.నేడు దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రేటు స్వల్పంగా తగ్గింది. దానికి అనుగుణంగా హైదరాబాద్ బంగారం ధర తగ్గింది. క్రితం సెషన్ లో భాగ్యనగరంలో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 95,180 రూపాయలుగా ఉండగా..స్వల్పంగా తగ్గి 95, 170 రూపాయల వద్ద కొనసాగుతోంది. మంగళవారం నాడు హైదరాబాద్ లో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ. 87,200 రూపాయలు ఉంది. నేడు బుధవారం నాడు స్వల్పంగా తగ్గి రూ. 87, 190 దగ్గర కొనసాగుతోంది.