|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 02:57 PM
టోల్ చెల్లించాలని కారును ఆపినందుకు సిబ్బందిపై రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి దాడికి పాల్పడ్డారు. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ వద్ద తాను ప్రభుత్వ ఉద్యోగిని అని టోల్ చెల్లించాడనికి ఉద్యోగి సిద్ధిఖీ నిరాకరించాడు. టోల్ కట్టి వెళ్లాలంటూ టోల్ సిబ్బంది వాహనాన్ని ఆపేశారు. దీంతో వాహనం నుండి దిగి టోల్ సిబ్బందిని దుర్భాషలాడుతూ సిద్ధిఖీ, అతని బంధువు దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సిబ్బంది మాత్రం కార్డు చెల్లదని డబ్బులు చెల్లించాలని సూచించారు. అయినా అతను వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడంతో మేనేజర్ డేవిడ్ రాజు కారును అడ్డుకుని డబ్బులు చెల్లించాలని కోరాడు. దీంతో ఆగ్రహానికి లోనైన సిద్దిఖీతో పాటు కుటుంబ సభ్యులు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డేవిడ్ రాజుతో పాటు మరో ఉద్యోగికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.