|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 08:22 PM
ఆరుగాలం శ్రమించి పండించిన పంట ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటామని అన్నదాతలు ఎవ్వరు అధైర్య పడుద్దని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి అంకుర్, వెంకటాపురం, చిమనగుంటపల్లి, వనపర్తి చిట్యాల మార్కెట్ యార్డ్, పెద్దగూడెం, క్రిష్ణగిరి, క్రిష్ణగిరితండా, నాచహల్లి, గ్రామాలలో మహిళా సమైక్య, పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.