|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 08:29 PM
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ గారి అధ్యక్షతన దిశ సమావేశానికి ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య , భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి , జిల్లా కలెక్టర్ హనుమంత రావు గారు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.అనంతరం పార్లమెంట్ సభ్యులు వివిధ శాఖల అభివృద్ధి పనుల సంబంధించిన పలు అంశాలపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించి సమీక్షించారు.ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు మరింతగా కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ దిశ ప్రాముఖ్యతను గుర్తించి సమావేశంలో ప్రతిపాదించిన, చర్చించిన, పరిష్కార విషయాలను ప్రతి మూడు మాసాలకు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ రహదారుల రంగంలో పనులు వేగవంతం అయ్యేలా తగిన చర్యలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.