|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 03:19 PM
తెలంగాణలో వేర్వేరు చోట్ల ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వరంగల్ జిల్లా గిర్మాజి పేటలో UPకి చెందిన యువకుడు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
పాప ఏడవడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇక హైదరాబాద్ హుమాయున్‌నగర్‌లో ఆరేళ్ల బాలికపై కిరాణా షాప్ యజమాని అబ్దుల్ రౌఫ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.