|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 06:21 PM
వరంగల్ జిల్లా గిర్మాజిపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రంజాన్ అనే యువకుడు.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. బుధవారం రాత్రి మూడేళ్ల వయసున్న పక్కింటి బాలికపై అత్యాచారయత్నం చేయడంతో బాలిక కేకలు వేసింది. దాంతో చుట్టుపక్కల వారు మేలుకొని నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబసభ్యులకు ఇచ్చిన పిర్యాదు ఆధారంగా నిందితుడిపై ఫోక్స్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఇంతేజార్‌గంజ్‌ఇన్‌స్పెకర్టర్ షుఖుర్ తెలిపారు.