|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 11:43 AM
ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వవిప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు,జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు,అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు,ఆర్డీవో కృష్ణా రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.ముందుగా అంబేద్కర్ గారి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆ తర్వాత భూ భారతి పోర్టల్ కి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ.. భూ భారతి చట్టం రైతుల చట్టం,భూ వివాదల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూ భారతి చట్టం అన్నారు.ప్రతి వ్యక్తికి ఆధార్ లాగా ప్రతి భూమికి భూదార్ ని చెప్పారు.భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ,భూధాన్,అసైన్డ్,దేవాదాయ భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా CCLA కి అధికారాలు ఉంటాయన్నారు. కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చమని,ఎవరి భూమి అయిన వేరే వాళ్ళకు తప్పుగా నమ్ముదైతే ఎమ్మార్వో,ఆర్డీవో,జేసీ,కలెక్టర్ కు అప్పీలు చేసుకొని పరిష్కరించుకోవచ్చాన్నారు.ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడంతో రైతులకు అన్ని సేవలు గ్రామంలోనే అందుతాయన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు,ప్రజలకు అన్ని సేవలు అందించేలా ఉపయోగపడుతుందన్నారు.