|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 03:16 PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న అఘోరి, వర్షిణి దంపతులు సంచలన ప్రకటన చేశారు. తామిద్దరిని అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తలపై వారు స్పందించారు. తమ జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటామని స్పష్టం చేశారు. తామిక తెలుగు రాష్ట్రాలకు రామని, కేధార్నాథ్‌కు వెళ్లిపోతున్నామని చెప్పారు. జీవితాంతం అక్కడే ఉంటామని పేర్కొన్నారు.లేడీ అఘోరీపై వివాదాలు అన్నీఇన్నీ కాదు. ఇప్పటికే తాను మొదటి భార్యనంటూ రాధిక రచ్చ చేస్తోంది. అఘోరీతో ఫోటోలు, వాయిస్ కాల్స్ లీక్ చేసింది. వర్షిణి జీవితం నాశనం అవుతుందని హెచ్చరించింది. మరో యువతిని మోసం చేయకుండా అఘోరీని అరెస్ట్ చేయాలని రాధిక డిమాండ్ చేస్తోంది. ఇన్ని గొడవలు బయటకు వస్తున్నా.. లేడీ అఘోరీ మాత్రం తగ్గేదేలే అంటోంది. రాధిక ఎపిసోడ్ బయటకు రాగానే.. శ్రీవర్షిణిని ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకుంది. ఈసారి ఆ పెళ్లి లైవ్ టెలికాస్ట్ కూడా చేసింది. రాధిక ఆరోపణలన్నీ అబద్దమని.. దమ్ముంటే తమకు పెళ్లి అయినట్టు సాక్షాలు ఉంటే చూపించమని డిమాండ్ చేస్తోంది. తాను అనేకసార్లు డబ్బులు కూడా ఇచ్చానని.. ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ కూడా కావాలని అంటోంది. ఇక శ్రీవర్షిణియే తన భార్య అని.. జీవితాంతం తామిద్దరం కలిసే ఉంటామని చెబుతోంది ఆ జంట. తమను ఎవరైనా విడదీయాలని చూస్తే.. తమ జోలికి వస్తే.. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు ఆ ఇద్దరు.