|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 04:18 PM
నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దు అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
సంభందిత అధికారులు అందరూ సమన్వయంగా పని చేసి రైతులకు నకిలీ వితనాలు సరఫరా జరగకుండా చూడాలన్నారు. రాష్ట్రానికి, దేశానికి వ్యవసాయం ముఖ్యమైన ఆధారం అలాంటి వ్యవసాయం చేసే రైతులు నష్టపోకుండా చూడాలన్నారు.