|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 08:36 PM
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్‌లోని టోక్యో వాటర్ ఫ్రంట్‌ను సందర్శించింది. టోక్యో నగరం మధ్య నుంచి పారే సుమిదా నది రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి, సుమిదా నది పక్క నుంచి పొడవాటి ఫ్లైఓవర్, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని పరిశీలించింది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో బృందం వీక్షించింది. సోనీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలిసి చర్చలు జరిపారు. హైదరాబాదులో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాల్లో అనుకూలతలను వివరించారు.