|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 02:01 PM
మైనర్లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన అలాగే, వీరిని ప్రోత్సాహస్తూ వాహనాలు అందజేసిన చట్టపరమైన ఇక్కట్లు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతొంది. ముఖ్యంగా తెలిసి తెలియని వయస్సులోని మైనర్లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాల సంఖ్య ఘణనీయంగా పెరిగే అవకాశం వున్నందును ఇలాంటి ప్రమాదాల నివాణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన చర్యలు తీసుకొవడంతో జరుగుతోంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కితే కేసు నమోదు చేసి వాహనం స్వాధీనం చేసుకొవడంతో పాటు వాహనం నడిపినందుకు గాను సదరు మైనర్‌ను కోర్టులో హరజర్‌పర్చి న్యాయమూర్తి ఆదేశాల మేరకు పరిశీలన గృహంకు (అబ్జర్‌వేషన్ హోం) పంపబడుతుంది. అలాగే వాహన యజమానిగాని లేదా మైనర్ తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేసి వారికి కౌన్సిలింగ్ ఇవ్వబడుతుందని.
అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి వాహనం అందజేయడం కూడా నేరమని వాహనదారులు గమనించాలని, ఒక వేళ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వాహన యజమానికి కూడా జరిమానా విధించడంబడటంతో పాటు వాహనం స్వాధీనం చేసుకోబడుతుందని. ముఖ్యంగా మైనర్లు వాహనం నడుపుతూ ఏదైన ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే, మోటార్ వాహన చట్టం అనుసరించి వాహన యజమానికి మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా 25వేల రూపాయల జరిమాన విధించడం జరుగుతుందని. పట్టుబడిన మైనర్లకు 25 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్హత కోల్పోతాడని, పట్టుబడిన వాహనం రిజిస్ట్రేషన్ ఒక సంవత్సర కాలం రద్దు చేయడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమినరేట్ పరిధిలో గత జనవరి మాసం నుండి ఇప్పటి వరకు 63 మంది మైనర్లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన సంఘటనల్లో మొత్తం 35278 కేసులు నమోదు చేసి 12552 వాహనాలు స్వాధీనం చేసుకొవడం చేసుకోవడంతో పాటు వాహనం అందజేసిన వాహన యజమానులకు 16లక్షల47 వేల రూపాయల జరిమాన విధించడం జరిగిందని పోలీస్ కమిషనర్ వెల్లడిరచారు. ఇకనైన తల్లిదండ్రులు, వాహన యజమానులు మైనర్లకు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి వాహనాలను అందజేసే చిక్కుల్లో పడవద్దని పోలీస్ కమిషనర్ సూచించారు.