|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 02:16 PM
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణను రద్దు చేయాలని కోరుతూ వైరాలో ముస్లింలు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి ముస్లింల పట్ల చిత్తశుద్ది లేదన్నారు. రాజ్యాంగ విరుద్దమైన చట్టాన్ని కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో పెట్టడం దురదృష్టకరమన్నారు. చట్టాన్ని రద్దు చేసే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు.