|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 03:31 PM
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అగ్నిమాపక సిబ్బంది శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని హోటల్లు, టిఫిన్ సెంటర్లు, ఆసుపత్రులు, ఫంక్షన్ హాల్లలో ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదాలు నివారించవచ్చని ఫైర్ సిబ్బంది సూచించారు.