|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 08:27 PM
హైదరాబాద్‌లో తమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడంపై ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. తమకు ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల నుంచి రాగానే ఆయనను కలుస్తానని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని అన్నారు. హైడ్రా చేసింది సరైనదే అయితే కోర్టుకు సెలవు ఉన్న రోజే వచ్చి కూల్చివేతలు ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠను దిగజార్చేలా హైడ్రా ప్రవర్తించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు