|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 08:34 PM
TG: ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోళ్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ ముఖ్య అధికారులతో శనివారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 'ఈ ఏడాది యాసంగిలో రికార్డు స్థాయిలో 127.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంది. వానకాలం, యాసంగి కలిపి 281 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది' అని చెప్పారు.