|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 11:37 AM
మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నాగులపల్లి బ్రిడ్జి వద్ద వెనుక చక్రాలు ఊడిపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తతతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వేరే బస్సులో ప్రయాణికులు హైదరాబాద్ వెళ్లిపోయారు.