|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 11:41 AM
కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 328 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో 2, 66, 896 ఎకరాలలో వరి సాగు అయిందని, 5, 86, 723 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ధాన్యం విక్రయ సొమ్ము, జమ కావడం కూడా ప్రారంభమైందని తెలిపారు. జిల్లాలోని 96 మిల్లులకు 4 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల మిల్లింగ్ చేసే సామర్థ్యం ఉందన్నారు.