|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 04:10 PM
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ పేరును తొలగించాలన్న హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ ఆదేశించడం తెలిసిందే. ఈ ఆదేశాలపై అజహరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ఇది తనను అగౌరవపరిచే చర్య అని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని, హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా వ్యవహరిస్తున్న జస్టిస్ ఈశ్వరయ్య ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేశారు. అజహరుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే స్టాండ్‌కు ఆయన పేరు పెట్టారని, ఇది విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని అంబుడ్స్‌మన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. తక్షణమే స్టాండ్ నుంచి అజహర్ పేరును తొలగించాలని, భవిష్యత్తులో మ్యాచ్‌ల టికెట్లపై కూడా ఆ పేరు ఉండకూడదని ఆయన హెచ్‌సీఏకు సూచించారు. ఈ నేపథ్యంలో అజహరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు."స్టేడియంలోని స్టాండ్ కు నా పేరు పెట్టుకోవడంలో కుట్ర కోణం గానీ, స్వప్రయోజనాలు గానీ ఏమీ లేవు. ఈ వివాదంపై నేను ఎక్కువగా వ్యాఖ్యానించదల్చుకోలేదు. ఆ స్థాయికి దిగజారాలని అనుకోవడం లేదు. ఈ అసోసియేషన్‌ను చూసి క్రికెట్ ప్రపంచం నవ్వుతోంది" అని అజహరుద్దీన్ అన్నారు.