|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 07:37 PM
జిల్లాలో పని చేసిన 61 మంది హోమ్ గార్డులు మహబూబ్ నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో హోమ్ గార్డులతో సమావేశం నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా హోమ్ గార్డులు చేసిన సేవలను కొనియాడారు. అప్పగించిన విధులు సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని ఇన్‌చార్జి ఆర్ ఎస్సై మద్దయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.