|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 03:27 PM
కల్వకుంట్ల కవిత ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి ఆలయానికి వచ్చిన కవితకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం శ్రీ లక్షీ తాయారమ్మ వారి ఆలయంలో పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా కవితతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, చంద్రావతి, రేగా కాంతారావు ఉన్నారు.