|
|
by Suryaa Desk | Tue, Apr 22, 2025, 11:36 AM
నర్సాపూర్ నియోజకవర్గం లోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 1, 29, 000/- చెక్కులను ఎమ్మెల్యే సునితారెడ్డి అందజేశారు. ఆర్థికస్థితి గతులు బాగాలేక వైద్యం చేయించుకునే స్థోమత లేక అనేక మంది అప్పులు చేసి ఇబ్బందుల పాలవుతున్నారు. కావున వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు చంద్రాగౌడ్ , సార రామాగౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.