|
|
by Suryaa Desk | Tue, Apr 22, 2025, 12:31 PM
TG: మెదక్ జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాపన్నపేట మండలం నామాపూర్‌లో జోగయ్య (51) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన జోగయ్య.. ప్రతి రోజూ తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. దీంతో విసిగిపోయిన భార్య.. ఏప్రిల్ 20న మద్యం మత్తులో ఉన్న జోగయ్య కాళ్లను తన చిన్న కూతురు పట్టుకోగా, భార్య నాగమ్మ మెడకు చీర బిగించి చంపేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.