|
|
by Suryaa Desk | Tue, Apr 22, 2025, 02:10 PM
ఎమ్మెల్యే పాడె కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. గత ఎన్నికల సమయంలో తనకు ఓటు వేయకుంటే కుటుంబంతో సహ ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ వీడియో ఆధారంగా వరంగల్ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని ఆయన కోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది