|
|
by Suryaa Desk | Tue, Apr 22, 2025, 02:16 PM
TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. రేపాక గ్రామంలో తండ్రి మొండయ్య రోకలితో సొంత కొడుకు ఓదెలును దారుణంగా కొట్టి చంపాడు. అయితే ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ప్రజలోని ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.