|
|
by Suryaa Desk | Tue, Apr 22, 2025, 03:39 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం మధ్యాహ్నం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం ఆరబోస్తున్న రైతులను ఏమైనా సమస్యలున్నాయని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.