|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 02:44 PM
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఒక ప్రకటనలో తెలిపారు.
మధ్యాహ్నం 2: 00 నుంచి సా. 6: 00 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రెవిన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారన్నారు. రైతులు హాజరుకావాలని సూచించారు.