|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 02:51 PM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీం అన్నారు.
బుధవారం నారాయణపేట పట్టణంలోని ఒకటవ వార్డులో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పాలన చేయాల్సిన పాలకులు నేడు రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలకు దిగుతున్నారని చెప్పారు.