|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 03:00 PM
జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ లో డిసిఎంఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కన్నాపూర్, కురుమ పల్లి గ్రామ రైతులు, నాయకులు బుధవారం కోరారు. స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.