|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 08:11 PM
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రంలో హైఅలర్ట్ విధించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది.ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.