|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 01:08 PM
ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద మిషన్ భగీరథ ఫైపు పగిలిపోవడంతో రోడ్డుపై నీరు వృధాగా పోతోంది. దీంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
శుక్రవారం రోడ్డు పక్కన ఉన్న వెంచర్ లో జేసీబీతో మరమ్మతులు చేయిస్తుండగా పైప్ లైన్ ను ఢీకొనడంతో పైప్ లైన్ పగిలిపోయింది. జేసీబీ డ్రైవర్ నిర్లక్షం కారణంగా పైప్ లైన్ పగిలి పోయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.