|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 07:50 PM
భూ హక్కులపై రైతులకు భద్రత కల్పించేలా భూ భారతి చట్టం రూపకల్పన చేశామని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. శుక్రవారం వైరా మండల కేంద్రంలోని కామిశెట్టి కల్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ భూ భారతి (భూమి హక్కుల) చట్టం- 2025 పై అవగాహన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, ఆర్డీఓ నరసింహా రావులు పాల్గొన్నారు.