|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 09:04 PM
బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించనున్న సభను పురస్కరించుకొని, ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. వారు ముందుగా గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని కమలనగర్ చౌరస్తా వద్ద, చైతన్యపురి డివిజన్ పరిధిలోని ప్రభాత్‌నగర్ చౌరస్తా, ఫణిగిరి కాలనీ వద్ద, కొత్తపేట డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ వద్ద, నాగోల్ డివిజన్ పరిధిలో జైపూరి కాలనీ చౌరస్తా మరియు చాణక్యపురి కాలనీలో జెండా పండుగలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న భారీ సభలో మన ఎల్.బి.నగర్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాలలో పలు డివిజన్ల మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, విభిన్న విభాగాల కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, యువత విస్తృతంగా పాల్గొన్నారు.