|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 02:13 PM
వరంగల్ కేఎంసీ ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నెల రోజులుగా నిలిచిపోయిన సర్జరీలు, చేసేదేమీ లేక రోగులను హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్న వైద్యులు. ఆసుపత్రిలో సెంట్రలైజ్డ్ ఏసీ మోటార్లు రిపేరుకు వచ్చాయని, ఏసీలు లేక సర్జరీలు చేయలేకపోతున్నామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వైద్యులు. ఏసీ రిపేరుకు రూ.10 లక్షలు అవసరమని నివేదికను ప్రభుత్వానికి పంపగా, ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదని అసహనం వ్యక్తం చేస్తున్న వైద్యులు. ఉన్న రెండు జనరేటర్లలో ఒకటి రిపేరులో ఉండగా, ఇంకొక జనరేటర్ ఆన్ చేస్తే అధిక లోడుతో ఆగిపోతుందన్న సిబ్బంది. ఎండాకాలం ఏసీ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని, 185 ఫ్యాన్లు కావాలని ప్రభుత్వానికి నివేదిక పంపగా, కేవలం 10 ఫ్యాన్లు మాత్రమే పంపిన ప్రభుత్వం. డయాలసిస్ యంత్రాలను ఫ్యాన్లతో చల్లబరుస్తూ రోగులకు డయాలసిస్ చేస్తున్నామని, ఎక్కువ రోజులు ఇలాగే చేస్తే డయాలసిస్ యంత్రాలు కూడా రిపేరుకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్న వైద్యులు. ఇప్పటికే 150కు పైగా సర్జరీలు నిలిచిపోయాయని, వెంటనే ప్రభుత్వం ఆసుపత్రిని బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న వైద్యులు, రోగులు