|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 03:23 PM
తెలంగాణలో అనేక జిల్లాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. నల్లగొండ, సూర్యాపేట, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాలో తెల్లవారుజామున మోస్తారు వర్షాలు కురిశాయి. అలాగే ఆదివారం సాయంత్రం లోపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. సోమవారం పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.