|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 03:25 PM
తెలంగాణ బానిస సంకెళ్లను తెంపి మనకు స్వేచ్చా స్వాతంత్రాన్ని సాధించిన పార్టీ BRS అని మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. రాష్ట్ర ప్రజలందరికి, ఉద్యమకారులకు, పార్టీ అభిమానులందరికి హృదయపూర్వక BRS పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'BRS అంటే రాష్ట్ర ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీక. రాష్ట్రంలో ఆదాయం మందగించింది. కాంగ్రెస్ 420 హామీల అమలు చేసేవరకు ప్రశ్నిస్తూనే ఉంటాం' అని సిద్దిపేటలో పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.