|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 03:34 PM
డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్‌తో జీవితకాల గరిష్ఠానికి చేరుకున్న బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. వాణిజ్య యుద్ధ భయాలు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టడంతో సోమవారం పసిడి ధర స్వల్పంగా తగ్గింది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ మళ్లీ బలపడుతుండటమే దీనికి కారణం. ఎంసీఎక్స్ గోల్డ్ జూన్ 5 కాంట్రాక్ట్స్‌లో ఈ ఉదయం 9.05 గంటలకు 10 గ్రాముల బంగారం ధరపై 0.18 శాతం తగ్గింది. ఫలితంగా పుత్తడి ధర రూ. 94,818 వద్ద ట్రేడ్ అయింది. అలాగే, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు దిగి వచ్చాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ దాదాపు 0.3 శాతం ఎగబాకింది. ఫలితంగా బంగారం డిమాండ్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో ఇతర కరెన్సీలో కొనుగోలు చేసే వారికి బంగారం ఖరీదు భారంగా మారింది.