|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 06:49 PM
తెలంగాణలోని టీనేజ్ బాలికలతో స్వయం సహాయక బృందాలు (SHG) ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు. వారికి పౌష్టికాహారంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా 14-18 ఏళ్లలోపు కిశోర బాలికలకు పల్లీ పట్టీ, చిరుధాన్యాల పట్టీలు అందిస్తామని చెప్పారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు.ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తిచేసే దిశలో పనిచేయాలి. ఆరేండ్లలోపు చిన్నారులంతా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండేలా చూడాలి. ఈ ఏడాది అంగన్‌వాడీల్లో హాజరు శాతం పెరగాలి. పిల్లల హాజరును మరో 30 శాతం పెంచేలా పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. తద్వారా చిన్నారుల్లో పోషకార లోపాన్ని నివారించవచ్చు. పిల్లల దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలి. దత్తత ఇచ్చేలోపు, పిల్లల సంరక్షణ బాధ్యతను స్వీకరించేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలి. ఆ చిన్నారుల సంరక్షణ బాధ్యతలు చూసుకునే వారికి ఆర్థిక చేయూతనిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం.