|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 06:50 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బంజారాహిల్స్ పీఎస్‌లో కేటీఆర్‌పై నమోదైన కేసును హైకోర్టు సోమవారం కొట్టివేసింది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి రూ.2500 కోట్లను పంపించారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును కొట్టేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు కేసును కొట్టేసింది.