|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 07:14 PM
పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో పట్టపగలే దారుణ హత్య. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో.. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్‌ను కత్తితో మెడపై పొడిచి దారుణంగా హత్య చేసిన ధర్మారం మండలం దొంగతూర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్. సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు . నిందితుడితో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించిన పోలీసులు